కమెడియన్ అలీకి తన తల్లి అంటే ఎంత ఇష్టమో కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే అలీ తల్లి జైతున్ బీబీ చనిపోయి నేటికి సరిగ్గా ఏడాది. అయితే ఆమె సంవత్సరికం సందర్భంగా ప్రజలకు అలీ తన వంతుగా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ పేదవారికి అనాధలకు ఆశ్రమాలకు వెళ్లి భోజనం పెడితే ఒక్క పూట తో పోతుంది. అలా కాకుండా ఏం చేద్దాం అనుకున్న సమయం లో నాకు ఆలోచన వచ్చింది. మా అమ్మ ఎప్పుడు శాలువానో దుప్పటో కప్పుకుని ఉండేది. ఇప్పుడు చలి ఎక్కువగా ఉంది. అందుకే ఆమె జ్ఞాపకార్థం హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర బస్టాండ్ వద్ద ఉండే వారికి దుప్పట్లు పంచాలి అనుకున్నాను.
Advertisements
మా అమ్మ వెచ్చని జ్ఞాపకాలతో చేస్తున్న ఈ సాయం ఎంతో మందికి చలి నుంచి కాపాడుతుంది. ఇది పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు. ఇలా ఎప్పటికప్పుడు నా వంతుగా ఏదో ఒకటి చేయడం నాకు ఆత్మ సంతృప్తినిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు అలీ.