విశాఖలో పోలిసుల దాడిలో తీవ్రంగా గాయపడి మెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ ను టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత కలిశారు. డాక్టర్ సుధాకర్‌ను మానసిక ఆస్పత్రిలో చేర్చించడం దారుణం అన్నారు. డాక్టర్ సుధాకర్ నాతో చక్కగా మాట్లాడారని , ఆయన మానసిక పరిస్థితి బాలేదని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించడం దుర్మార్గమని తొలివెలుగు తో మాట్లాడుతూ చెప్పారు అనిత.
డాక్టర్ సుధాకర్ దళితుడు కాబట్టే దాడి చేశారన్నారు. మాస్కులు లేవని ప్రశ్నించినందుకు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని వీధిలో పెట్టారని ప్రభుత్వంపై అనిత నిప్పులు చెరిగారు. దళితులపై దాడులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు .