దేశంలో కరోనా కేసులు మరికొంత కొద్దిగా తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 27 వేల కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసుల సంఖ్య 98.84 లక్షలకు చేరింది. ఇక కరోనా కారణంగా నిన్న 336 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు లక్షా 43 వేల 355 మంది మరణించారు.
Advertisements
మరోవైపు కరోనా బారి నుంచి ఇప్పటివరకు 93 లక్షల 88 వేల 159 మంది కోలుకున్నారు. మరో 3 లక్షల 52 వేల 586 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 8.55 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 15.45 కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.