ఆంధ్రప్రదేశ్ తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు 5 గంటలతో ముగిసింది. చివరి రోజు కావడంతో అనేక చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఘర్షణల మధ్యే పలు చోట్ల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆఖరు రోజు కావడంతో పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్లను అధికారులు రేపు పరిశీలిస్తారు.
ఫిబ్రవరి 4న వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువును ఇచ్చారు. ఫిబ్రవరి 9న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 3,249 పంచాయతీలు, 32,504 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.