స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు తన భార్య స్నేహ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పిల్లలు అయాన్ అర్హ ల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ ఫోటో గ్రాఫర్ గా మారారు.
తన పిల్లలు అయాన్, అర్హ తో పాటు మరో చిన్నారిని తన సెల్ ఫోన్ లో ఫోటోలు తీస్తూ ఫోటో గ్రాఫర్ గా మారారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం తర్వాతి షెడ్యూల్ తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో షూట్ చేయనున్నారు. ఇక త్వరలోనే అల్లుఅర్జున్ కూడా షూటింగ్ కు హాజరు కానున్నాడు.