సినిమా షూటింగ్ లో గాయపడి ఆపరేషన్ చేయించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నగరంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. ప్రకాష్ రాజ్ కు అన్ని టెస్టుల జరిపిన డాక్టర్లు.. ఓకే అనుకున్నాక ఇంటికి పంపారు.
Advertisements
గత మంగళవారం తమిళ హీరో ధనుష్ సినిమా షూటింగ్ లో గాయపడ్డారు ప్రకాష్ రాజ్. అయితే తనకేం కాలేదు.. చేతికి గాయమైంది.. డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ బుధవారం ట్వీట్ చేశారాయన. చిన్నపాటి సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పినట్లుగా వివరించారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కు ఆపరేషన్ చేసిన డాక్టర్లు.. కోలుకున్నాక ఇంటికి పంపించారు.