సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు
సార్వభౌధికారం, సౌభ్రాతృత్వంతో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించేలా రాజ్యాంగన్ని అంబెడ్కర్ అందించారు. ఆయన ఇచ్చిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాయి. ఇప్పుడు దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగాన్ని కాలరాసి వారి రాజకీయ విధానాలను దేశం మీద రుద్దేలా ప్రయత్నాలు చేసున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలింగించే ఇటువంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజాస్వామ్య వాదులు, అంబెడ్కర్ వాదులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. ఈ జాతి నిర్మాణాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది.
అలా 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా నిర్మించిన దేశాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగున్నాయి.. దీనిని కచ్చితంగా నిలువరించాలి.