ఎయిర్ ఏషియా విమానంలో ఓ వ్యక్తి హల్చల్ చేసాడు. జైపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఆ ప్రయాణికుడు ఒక్కసారిగా విమాన ఉద్యోగిపై దాడి చేశాడు. అతన్ని అదుపులోకి తీసుకున్న సిఐఎస్ఎఫ్ అధికారులు, ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. జైపూర్ కు చెందిన ఆయుష్ గా పోలీస్ లు గుర్తించారు. దీనిపైనా పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.