వామ్మో.. బిజెపి డ్రామాకే మైండ్ బ్లాక్ అవుతుంటే.. జనసేన డ్రామాలకు మైండ్ రెడ్ అవుతోంది. బిజెపి వాళ్లు కనీసం వారి వాదనల్లో విషయం బయటపెట్టేస్తున్నారు. వారు పైకి ఏం చెప్పినా.. మనకో క్లారిటీ వచ్చేస్తుంది.. ఓకె.. వీళ్లు మూడు రాజధానుల కాన్సెప్ట్ ను ఆపే ఉద్దేశం లేదు.. దానిపై పోరాడే ఉద్దేశమూ లేదు.. కేవలం రైతులకు అన్యాయం చేయకుండా చూస్తామనే మాట తప్ప. కేంద్రం సైతం ఓ అఫిడవిట్ కోర్టులో పెట్టేశాక.. ఇంకా క్లారిటీ వచ్చేసింది. జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమనిపించేశారు. జనసేన సంగతి మాత్రం.. తాజాగా పవన్, సోము వీర్రాజుల మీటింగ్.. దాని తర్వాత జనసేన విడుదల చేసిన ప్రెస్ నోట్ తో తేలిపోయింది.
పవన్ కల్యాణ్ మాత్రం.. అంతకు ముందు అమరావతిని కదిపితే ఊరుకోమని ఆవేశంగా ప్రకటన చేశారు. పైగా బిజెపితో చేయి కలిపిందే దాని కోసమని చెప్పారు.. అది కూడా రాతపూర్వకంగా.. (సాంబా అప్పుడే నోట్ చేసుకున్నాడీ విషయం). కాని దానిపై పోరాటం మానేసి. .. సినిమా షూటింగులకు వెళ్లిపోయారు సడెన్ గా.. ఇప్పుడు మూడు రాజధానుల కాన్సెప్ట్ స్పీడప్ అయిపోయి.. అమలుకు సిద్ధమైన వేళ.. బిజెపి, వైసీపీలను తిడుతూ.. అమరావతి రాజధానిగా ఉండాలనుకునేవారంతా జనసేనాని ఏం చెబుతాడా అని ఎదురు చూశారు. సార్.. వారి పార్టీ సమావేశం రోజంతా జరిపి.. సాయంత్రానికి ఐదుపేజీల నోట్ విడుదల చేశారు. అందులో ఎక్కడా మూడు రాజధానులను ఆపాలని లేదు. అమరావతిని రాజధాని చేసినందుకు టీడీపీని.. ఇప్పుడు మూడు రాజధానులన్నందుకు వైసీపీని చెడమడా తిట్టేశారు. కాని బిజెపిని ఒక్క మాట అనలేదు. అప్పుడే అనుమానం వచ్చింది. కాని అమరావతి రైతుల పక్షాన పోరాటమంటున్నారే తప్ప.. అది ఏ డిమాండ్ పై అనే విషయం బిజెపి చెప్పలేదు.. జనసేన కూడా చెప్పలేదు. ఆయన దింపుడు కళ్లెం ఆశలుంటాయి కదా.. పవన్ ఏమన్నా బిజెపిని కాదని.. ముందుకు వస్తాడేమోనని కొందరు ఆశపడ్డారు.. అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దని చెప్పినా వినకుండా.
ఇప్పుడు బిజెపి రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజును.. ముందురోజు అన్నయ్య కలిసి కన్ను కొడితే.. ఇప్పుడు తమ్ముడుగారు కలిశారు. ఇద్దరూ కలిసి చర్చించారని.. ప్రెస్ నోట్ ఒకటి జనసేన అధికారికంగా విడుదల చేసింది. దాంట్లో ఎక్కడా మూడు రాజధానులకు వ్యతిరేకంగా పోరాటమని గాని.. అమరావతి తరలింపును అడ్డుకుంటామని కాని.. హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ మీద గాని.. ఒక్క మాట.. ఒక్కటంటే ఒక్క మాట లేదు. కేవలం అమరావతి రైతులకేం కావాలో చూస్తారట. వీరు అదే కోరుకున్నారట.. సోము వీర్రాజుగారు చెప్పారని రాసిన మాటల్లో కూడా అదే ఉంది. అంటే పవన్ కల్యాణ్ కూడా చేతులెత్తేశారని అందరూ సవినయంగా అర్ధం చేసుకోండి. ఇక మిగిలింది కేవలం టీడీపీ.. వామపక్షాలు మాత్రమే. టీడీపీ అధినేత ప్రెస్ మీట్లు దంచి కొడుతున్నారు.. అసలు దంచాల్సింది దంచటం లేదని.. స్వయంగా వారి పార్టీ ఎంపీయే ఎలుగెత్తి నిరసన చాటారు. వామపక్షాల సంగతి సరేసరి. సీపీఐ టీడీపీని ఫాలో అవుతుంటే.. సీపీఎం మాత్రం మొక్కుబడిగానే నిరసన తెలియచేసింది.
కాబట్టి.. విశాఖకు రాజధాని తరలింపుపై.. తీర్పు చెప్పాల్సింది ప్రజలే.. అది కూడా ఎప్పుడో వచ్చే ఎన్నికల్లో మాత్రమే అప్పటివరకు.. గప్ చుప్ సాంబార్ బుడ్డీ.