
బీజేపి టీఆర్ఎస్ దొందూ దొందేనన్నారు పొన్నం ప్రభాకర్. రెండు పార్టీలు కుమ్మక్కు రాజకియాలు చేస్తున్నాయని పోన్నం ఆరోపించారు..బీజేపి ఆధ్యక్షుడు నడ్డా కేసిఆర్ పై వాఖ్యలు కేవలం మాటలకే పరిమితమని నిజంగా ఆ వాఖ్యలకు కట్టుబడి ఉంటే కేసీఆర్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భారత దేశం లో ఆంతర్భాగం కాదా కేంద్ర ఆరోగ్య శాక మంత్రి ఎందుకు తెలంగాణ ను పట్టించుకోరని ప్రశ్నించారు..కేసీఆర్ పోతిరెడ్డిపాడు పై మౌనం వీడకపోతే చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడని హెచ్చరించారు. తొలివెలుగు తో మాట్లాడిన పొన్నం కేసీఆర్ పై మరిన్ని విమర్శలు చేశారు. అవేంటో తెలియాలంటే కింది వీడియో చూడాల్సిందే.