విశాఖ జిల్లా అరకు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అనంతగిరి హెయిర్ పిన్ బెండ్ 5 వద్ద పర్యాటకులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. చాలా మందికి గాయాలయ్యాయి.
బస్సులో మొత్తం 30 మంది ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఘటన ప్రదేశం దట్టమైన అడవి లోయ కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మృతులు, క్షతగాత్రులు అంతా హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. వారిని అనంతగిరి ఆస్పత్రికి తరలిస్తున్నారు. లోయలో పడిన బస్సును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే చీకటిగా వుండటంతో ఇబ్బందిగా మారింది.