భర్తల చేతిలో శవమైన భార్యల ఆత్మలే కాదు వారి తాలూకు చెప్పులు కూడా నిరసనలు చేపడుతాయి. చదవటానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా… నిజంగానే గత సంవత్సర కాలంలో భర్తల చేతిలో… చిత్ర హింసలకు గురైన భార్యల చెప్పులను నగరంలోని గోడ పై వేలాడదిశీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ నగరం ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ఆసియా, యూరోప్ ఖండాలను కలిపే ఏకైక నగరం. ఎంతో మంది రాజులు ఇస్తాంబుల్ కేంద్రంగా పరిపాలన చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలతో వార్తల్లో నిలుస్తోంది. ఒక సంవత్సర కాలంలో 450 మందికి పైగా భార్యలు తమ భర్తల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి నిరసనగా…. ఆ చనిపోయిన వారి చెప్పుల జతలను ఇస్తాంబుల్ నగరంలోని ఓ గోడ పై వేలాడదీశి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నారు.