ఇటీవల టిక్ టాక్ పుణ్యమా అని చాలా మంది ఎప్పుడో విడిపోయిన తమ కుటుంబాలను కలుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బిజినేపల్లి మండలం పెద్దతండాకు చెందిన రాత్లావత్ చంద్రునాయక్ మతి స్థిమితం సరిగా లేక 12 ఏళ్ల కిందట ఇంట్లోంచి వెళ్లిపోయాడు.నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామానికి చేరుకున్నాడు. ఎవరో ఒకరు భోజనం పెడితే తిని అక్కడే బడుల్లో, గుళ్ళలో పడుకునేవాడు. తన గురించి ఎవరైనా వివరాలు అడిగితే ఒక్కోసారి చెప్పేవాడని, ఒక్కోసారి సరిగా చెప్పేవాడు కాదని గుడిగండ్ల గ్రామస్థులు అంటున్నారు.
కాగా రామాంజనేయులు అనే యువకుడు చంద్రునాయక్ వివరాలు అడుగుతూ వీడియో రికార్డ్ చేసి, టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోను చూసిన పెద్దతండా శంకర్ దానిని చంద్రునాయక్ కుటుంబసభ్యులకు చూపించాడు. వీడియోను చూసిన చంద్రునాయక్ భార్య తన భర్తే అని పోలీసులను ఆశ్రయించింది. దాంతో వారు కలుసుకున్నారు.