సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషి సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది.
ఇక ఇందులో నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన సాంగ్స్, లుక్స్ , టీజర్ అన్ని కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. ఎట్టకేలకు ఫిబ్రవరి25న రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ డేట్ పై మరో అప్డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు లేదట.
Advertisements
అనుకున్న సమయానికే రిలీజ్ చేయనున్నారట. అలాగే మరికొన్ని రోజుల్లో మళ్ళీ అప్డేట్స్ కూడా స్టార్ట్ చేయనున్నారట. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.