కరోనా మహమ్మారి ఎవ్వరిని విడిచిపెట్టట్లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ లో ఈ మధ్య ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నటాషా సూరికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. ముఖ్యమైన పని ఉండి ఇటీవలే పూణె వెళ్లి వచ్చాను. వచ్చిన రెండు మూడు రోజులకు జ్వరం వచ్చింది. అనుమానం వచ్చి పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది ప్రస్తుతం జ్వరం, నీరసం ఉన్నట్లుగా ఆమె పేర్కొంది. ఈ భామ బిపాస బసు, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలో నటించిన డేంజరస్ చిత్రంలో నటించింది. ఆగస్టు 14వ తారీకున ఓటీటీ ద్వారా విడుదల కాబోతుంది.