ఆర్ఎక్స్100 చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు హీరో కార్తికేయ. ఆ తర్వాత ఓ మూడు సినిమాలు చేసినప్పటికీ అంతగా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే ప్రస్తుతం చావు కబురు చల్లగా అనే సినిమా చేస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాలో లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తోంది.
కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల కాగా సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది. మార్చి 19న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో బస్తీ బాలరాజు గా క శవాలను స్మశానానికి తీసుకెళ్లి పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు.