మాస్క్ అనేది కరోనా పుణ్యమా అని ఇప్పుడు చాలా వరకు కూడా కీలకంగా మారింది. మాస్క్ లేకుండా జనాలు బయటకు వచ్చే పరిస్థితి లేదనే మాట వాస్తవం. మాస్క్ విషయంలో మనం అనుకున్న విధంగా ఎలా పడితే అలా వాడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది మాస్క్ వాడే విషయంలో లెక్కలేని తనంగా ఉంటారు. ఏంటో తల మీద టోపీ తీసేసినట్టు తీసి పక్కన పడేస్తారు. కాని మాస్క్ ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.
మాస్క్ ధరించే ముందు చేతులు శుభ్రం చేయడం మర్చిపోవద్దు. అలాగే, మీరు మాస్క్ తీసిన తర్వాత చేతులు కడుక్కోండి.
మీ ముక్కు, నోరు మరియు గడ్డం కప్పబడి ఉండేలా చూసుకోండి
మాస్క్ తీసిన తర్వాత శుభ్రమైన ప్లాస్టిక్ సంచిలో నిల్వ చేయండి.
ప్రతిరోజూ మీ మాస్క్ ని ఉతుకుతూ ఉండాలి. సర్జికల్ మాస్క్ అయితే పడేయడం బెస్ట్.
కవాటాలతో ఉండే ముసుగులు ఉపయోగించవద్దు. ఎందుకంటే శ్వాస సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది.
ఒకే గదులలో ఒంటరిగా ఉన్నప్పుడు మెడికల్ మాస్క్ ధరించవద్దు. దగ్గు వస్తే మాత్రం ఏదైనా కచ్చితంగా అడ్డు పెట్టుకోవాలి.
ముందు భాగాన్ని తాకకుండా తగిన టెక్నిక్‌ను ఉపయోగించి మాస్క్ ని తీయండి. వెనుక నుండి లేస్ ద్వారా మాస్క్ తీసేయండి.
ముసుగులు తడిగా / తేమగా మారితే వెంటనే శుభ్రం చేసి పొడిగా ఉంచుకోండి.
సింగిల్-యూజ్ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవద్దు