
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆస్పత్రుల్లో వందల బెడ్లు ఖాళీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు…కానీ ఒక పాజిటివ్ రోగి ఆస్పత్రిలో అడ్మిట్ కావాలంటే రెండు రోజులు పడుతోంది. ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకోలేదని మనుబోలు హైస్కూలు హెచ్ఎం రమేష్ కుమార్ నడిరోడ్డుపైకి రావడం దురదృష్టకరం ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే అడ్డగోలుగా చెప్పింది చేయలేదని కలెక్టర్ ను సెలవుపై పంపేశారు. మంచి అధికారిగా, నిజాయతీ పరుడుగా పేరుతెచ్చుకున్న జేసీ వినోద్ కుమార్ ను బదిలీ చేసేశారు. పరిపాలన పరంగా ఇవి తప్పుడు సంకేతాలు ఇస్తున్నాయి.. ఇప్పటి వరకు పరిస్థితులెలా ఉన్నా కొత్త కలెక్టర్ గా వచ్చిన చక్రధర్ బాబుపై నమ్మకం ఉంది. ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, వైద్యసేవల్లోని లోపాలను ఆయన వెంటనే సరిదిద్దుతారని ఆశిస్తున్నాం. ఇలాంటి ఆందోళనకరమైన, ప్రాణాంతకమైన, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపే పరిస్థితులు ఇంతకుముందెన్నడూ చూడలేదు.. కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్లు ఇచ్చానంటోంది..ఆ నిధులు ఏం చేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన వందల కోట్ల విరాళాలు ఏమయ్యాయి. పారాసెట్మాల్ వేసుకుంటే చాలని ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోవడంతో రాష్ట్రంలో 2.80 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్న రాష్ట్రమైన ఏపీ కరోనా కేసుల విషయంలో మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి వచ్చింది ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో రాజకీయాలనుపక్కనపెట్టేద్దాం..ప్రజల ప్రాణాలు కాపాడుకోవాల్సిన సమయమిది..
యువకుడైన సీఎం రాష్ట్రంలో ఎక్కడైనా నాలుగు ఆస్పత్రులు సందర్శించి ప్రజలకు అండగా నిలవకపోవడం దురృదష్టకరం.
వైద్యులు, నర్సింగ్, సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు..వారి క్షేమం గురించి ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయలేదు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో రూ.కోటి, విజయవాడ అగ్ని ప్రమాద ఘటనలో రూ50 లక్షలు మతులకు పరిహారం ప్రకటించారు..సంతోషం..ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వసతులు, మెరుగైన వైద్యం లేక ప్రాణాలు కోల్పోతున్న వారికి పరిహారం చెల్లించరా. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయిన బాధితులకైనా రూ.10 లక్షలు చెల్లించాలని మా పార్టీ డిమాండ్ చేసింది.ప్రభుత్వ వైపు నుంచి ఉలుకూ పలుకూ లేదు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కేరళ వంటి రాష్ట్రాలను చూసైనా నేర్చుకోండి..
మా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఏపీలో కోవిడ్ కంట్రోల్ అయిందని గొప్పలకు పోయిన మంత్రులు ఈ రోజు ఎక్కడున్నారో…కరోనా మృతుల అంత్యక్రియలకు రూ,15 వేలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ మతదేహాలను చెత్త ట్రాక్టర్లు, జేసీబీల్లో తరలిస్తున్నారు. కోవిడ్ రోగులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే సమయంలో ఇస్తామన్న రూ.2 వేలు ఏమవుతున్నాయో…పాజిటివ్ కేసుల విషయంలో దేశంలోనే మూడో రాష్ట్రంగా నమోదైన తర్వాత కూడా కదలకుండా కూర్చుకుని టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ ని తిట్టుకుంటూ ఉపన్యాసాలిచ్చుకుంటే మీకేమెస్తుంది. భారీ మెజార్టీతో అధికారం చేపట్టిన ఒక ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరించడం తగదు.
కేంద్ర ప్రభుత్వం 8 వేల కోట్లు ఇచ్చానంటోంది..ఆ నిధులు ఏం చేశారు..సీఎం రిలీఫ్ ఫండ్ కు వచ్చిన వందల కోట్ల విరాళాలు ఏమయ్యాయి.