అమరావతి 3 రాజధానుల వ్యవహారం న్యాయస్థానం చూసుకుంటుంది..రాష్ట్రంలో కరోనా విలయ తాండవం చేస్తుంది. వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి కరోనా కట్టడి చేయడం కోసం జగన్ పట్టించుకోవాలని కోరారు మాజీ మంత్రి పితాని సత్యనారాయణ. తాను రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో పని చేశానని రాజశేఖర్ రెడ్డి పరిపాలన నేడు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. తొలివెలుగు తో మాట్లాడిన పితాని సత్యన్నారాయణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అమరావతి రాజధాని కోసం రైతుల భూములు ఇచ్చారని చంద్రబాబు నాయుడు కోసం భూములు ఎవరు ఇవ్వలేదని తెలిపారు.రాజధాని విషయమై పితాని సత్యన్నారాయణ జగన్ ప్రభుత్వం పై మరెన్నో విమర్శలు చేశారు. ఆ విమర్శలు ఏంటో తెలియాలంటే కింది ఇంటర్వ్యూలో చూడాల్సిందే.