విజయ్ కుమార్, మంజు ల పెద్ద కూతురు వనిత ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న వనిత లాక్ డౌన్ టైంలో పీటర్ పాల్ అనే వ్యక్తిని ముచ్చటగా మూడో వివాహం చేసుకుంది. ఈమె వివాహం ఆ సమయంలో వివాదాస్పదంగా కూడా మారింది. అయితే ఈ మూడో పెళ్లి ఎన్ని రోజులు నిలవలేదు ఇద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.
అయితే తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న వనిత మరో షాక్ ఇచ్చింది. తాను మళ్లీ ప్రేమలో పడ్డానని చెప్పుకొచ్చింది. గురువారం ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేసింది. అయితే ఎవరితో ప్రేమలో పడిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమె పై ట్రోల్స్ మొదలయ్యాయి.
Advertisements