రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మెడికవర్ ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ కుడి కన్ను, అలాగే ఛాతి పైన, పొట్ట పైన గాయాలయ్యాయి. అంతేకాకుండా ఆ సమయంలో లో రోడ్డు ని బలంగా సాయి ధరమ్ తేజ్ ఢీకొట్టడంతో పాటు పల్టీలు కొట్టినట్టుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే అపోలోలో ఎమ్ ఆర్ ఐ తీసేందుకు సాయి ధరమ్ తేజ్ ను అక్కడకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు. సాయిధరమ్ తేజ్ మేనమామ పవన్ కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వచ్చి వైద్యులతో మాట్లాడారు.