మహారాష్ట్రలో మళ్లీ పరిస్థితి అదుపు తప్పుతోంది . కరోనా వైరస్ విజృంభించిన తొలినాటి రోజుల దిశగా ఆ రాష్ట్రం వెళుతున్నట్టు కనిపిస్తోంది. వారం రోజులుగా అక్కడ నమోదవుతున్న కొత్త కేసులు తీవ్ర కలవరం రేపుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అయితే ఏకంగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఒక్కరోజులోనే అక్కడ 54 మంది ప్రాణాలు కోల్పోయారు.తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 22.52 లక్షలకు పెరిగింది. ఇక మరణాలు 52,610కు చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు లక్ష యాక్టివ్ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
తాజా పరిణామాలను చూస్తోంటే మహారాష్ట్రలో పరిస్థితులు అదుపుతున్నట్టే కనిపిస్తున్నాయి. తాజా విజృంభణను నియంత్రించాలంటే అక్కడే మళ్లీ లాక్‌డౌన్ తప్పదేమో అనిపిస్తోంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తోంది. వ్యక్తిగత క్రమశిక్షణ లేకపోతే కచ్చితంగా అదే చేయాలని శివసేన సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది.