ఐపిఎల్ 2021 ముందు తన మ్యాచ్ జెర్సీ నుంచి ఆల్కహాల్ బ్రాండ్ లోగోను తొలగించాలని మొయిన్ అలీ ఫ్రాంచైజీకి విజ్ఞప్తి చేసినట్లు వచ్చిన వార్తలలను చెన్నై సూపర్ కింగ్స్ సిఇఓ కాసి విశ్వనాథన్ ఖండించారు. చెన్నైకి చెందిన ఎస్ఎన్జె డిస్టిలరీస్ తయారు చేసే ఎస్ఎన్జె 10000 బ్రాండ్ లిక్కర్ లోగోను తొలగించాలని మొయిన్ కోరుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కాసి విశ్వనాథన్ జాతీయ మీడియాకు వాస్తవాలు చెప్పారు.
ఈ వార్తలు నిజం కాదని…అసలు అలాంటి విజ్ఞప్తి అతని నుంచి రాలేదని అన్నారు. వాస్తవానికి మొయిన్ అలీ తన జెర్సీలలో ఆల్కహాల్ బ్రాండ్ల లోగోలను ఉంచడానికి ఇష్టపడటం లేదు. ఇంగ్లాండ్ కోసం ఆడినా ఏ లీగ్ అయినా సరే అందులో అతను పట్టుదలగా ఉన్నాడు. అతని మతాచారం ప్రకారం మద్యం నిషేధం. ఫిబ్రవరిలో జరిగిన ఐపిఎల్ 2021 వేలంలో 33 ఏళ్ల ఆటగాడిని సిఎస్‌కె 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాత మొయిన్ అలీ ఇది రెండవ ఐపిఎల్ ఫ్రాంచైజ్. మొయిన్ ఇప్పటివరకు 19 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడి 309 పరుగులు చేసి 10 వికెట్లు తీశాడు. ఇక తాను ధోనీ సారధ్యంలో ఆడటానికి చాలా ఉత్సాహంగా ఉన్నా అని ఈ ఇంగ్లాండ్ ఆటగాడు చెప్పాడు. ధోనీ దగ్గర ఆడితే విశ్వాసం పెరుగుతుందని అన్నాడు. ఈ నెల 10 న ముంబై లో ఐపిఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుంది.