కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జీహెచ్ఎంసీ అధికారులు అనుకోని విధంగా షాక్ ఇచ్చారు. లక్ష రూపాయలు జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. అసలు విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లో ఉన్న మోహన్ బాబు ఇంటి ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ ఉంది. అయితే ఆ బోర్డును జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఏర్పాటు చేశారట.
ఈ నేపథ్యంలో నే అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. లక్ష రూపాయల జరిమాన విధిస్తూ నోటీసులు అందించారు. కాగా ఈ విషయంపై మోహన్ బాబు గాని ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎవ్వరూ అధికారికంగా స్పందించలేదు.