కరోనా మహమ్మారి కారణంగా ప్రాణభయంతో మానవాళి మనుగడ కొనసాగిస్తుంటే కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు మాత్రం అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. అధికంగా ఫీజులు వసులు చేస్తూ నిలువునా ముంచేస్తున్నారు. ఆ టెస్ట్ ఈ టెస్ట్ ల పేరుతో లక్షల్లో బిల్లులు వేసేస్తున్నారు. గతంలో కూడా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న కారణంతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం చెయ్యవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాగా కరోనా వైద్యం పేరుతో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని అరికడుతూ, యశోద ఆసుపత్రిని వెంటనే సీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంచాలకులకు బీజేపీ నేతలు మెమోరాండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ ,బిజెపి రాష్ట్ర నాయకుడు సందీప్ ముత్తగి,రాష్ట్ర బిజెవైఎం
అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.