అనుపమ పరమేశ్వరన్.. మళయాలం ప్రేమమ్ సినిమాతో సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయిన బ్యూటీ. తెలుగులో కూడా ఈ అమ్మడు బాగానే సినిమాలు చేసింది. కానీ రామ్, శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇలా యంగ్ హీరోల సరసన సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ మాత్రం తగల్లేదు. దీనితో అనుపమకు పెద్ద హీరోల సరసన ఛాన్స్ లు రాలేదు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన నటించే ఛాన్స్ వచ్చిందట అనుపమాకు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాలో అనుపమ హీరోయిన్‌గా ఎంపికైందట. కుమారి 21 ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉందట.