డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ పోతినేని సూపర్ హిట్ ని అందుకున్నాడు. ఆ తరువాత రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా హిట్ సాధించలేకపోయినా నటన పరంగా రామ్ కు మంచి పేరును తీసుకువచ్చింది.
అయితే రామ్ ఇప్పుడు లింగుసామి తో సినిమా చేయబోతున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 6 గా తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఓ పక్క మాస్ చిత్రం తెరకెక్కబోతోంది. గురువారం ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.