సంచలనం రేపిన దిశ హత్య కు కారణం అయిన నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసినప్పటికీ అత్యాచారాల పరంపర కొనసాగుతూనే ఉంది.ఎన్ని కఠిన చట్టాలు వచ్చిన, కామాంధులు తమ వైఖరిమాత్రం మార్చుకోవట్లేదు. తిరుపతి సమీపంలోని ముళ్ళపూడిలో 16 ఏళ్ళే మైనర్ బాలికను ఇద్దరు యువకులు రేప్ చేశారు. లిఫ్ట్ ఇస్తామని చేప్పి ఆమె పై అత్యాచారం జరిపారు. అత్యాచారం చేసిన నిందితులు వెంకటేశ్,రాజమోహన్ నాయక్ అనే ఇద్దరు యువకులను తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు.