వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ పై విమర్శలు ఎక్కుపెట్టారు. దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ఇక ఎల్లో వైరస్’ ఇక జాగారం చేయాల్సిందేనని విమర్శించారు. దేశం మొత్తం మీద సీఎం జగన్ లా చొరవ చూపిన రాష్ట్రం మరేదైనా ఉంటే ఎల్లో మీడియా ఆ విషయాన్నీ ప్రజలకు చూపించాలని సవాల్ విసిరారు. విజనరీ కి సందు దొరకలేదు కానీ ఈ ఐడియా ఇచ్చింది తానేనని డప్పు వాయించుకునేవాడు అంటూ పరోక్షంగా చంద్రబాబును ఎద్దేవ చేశారు.
అంతేకాకుండా, ఇంగ్లీష్ మీడియం అంశంపై స్పందిస్తూ… ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం జీవోను కొట్టివేయడంపై సుప్రీంకోర్టుకు వెళ్లకూడదట. దానిపై పిటిషన్లు వేయిస్తూ, ఎగువ కోర్టుకు వెళ్లడం అమానుషం అంటాడు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజల రక్తం తాగావు. పేద పిల్లలు నీ మనవడిలా చదువుకోవద్దా? వాళ్లేం పాపం చేశారు బాబూ?” అంటూ ట్వీట్ చేశారు.