తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. సర్వదర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి. బుధవారం నుంచి టోకెన్లు జారీ చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాకు చెందినవారికి మాత్రమేనని తెలిపింది.
కరోనా సెకెండ్ వేవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శన టోకెన్లను నిలిపివేశారు. కేవలం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అదికూడా పరిమిత సంఖ్యలోనే. అయితే సర్వదర్శనం విషయంలో టీటీడీపై విమర్శలు వచ్చాయి. దీంతో కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతానికి చిత్తూరు జిల్లాకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఓకే చెప్పింది టీటీడీ.
Advertisements
బుధవారం ఉదయం 6 గంటల నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 2వేల టోకెన్లను మాత్రమే ఇవ్వనున్నారు. గతంలో రోజుకు 8వేల టోకెన్ల వరకు ఇచ్చేవారు.