కేంద్రంలో నెంబర్ టూ… హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీలో పర్యటించనున్నారు. ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలానికి వెళ్లనున్నారు. హైదరాబాద్ మీదుగా అమిత్ షా శ్రీశైలం వెళ్తుండడంతో తెలుగు రాష్ట్రాల పోలీసులు అలర్ట్ అయ్యారు.
Advertisements
ఉదయం 11.15 గంటల తర్వాత బేగంపేటకు చేరుకోనున్న షా… అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలానికి వెళ్తారు. మధ్యాహ్నం 12.25కు కర్నూలు జిల్లా సున్నిపెంటకు చేరుకుంటారు. 12.45 నుంచి 1.45 మధ్యలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. 2 గంటలకు అక్కడే అతిథి గృహంలో భోజనం చేసి… కాసేపటి తర్వాత హైదరాబాద్ బయలుదేరతారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగుపయనం అవుతారు.