షార్ట్ ఫిలిమ్ పేరుతో వ్యభిచారమా - Tolivelugu

షార్ట్ ఫిలిమ్ పేరుతో వ్యభిచారమా

, షార్ట్ ఫిలిమ్ పేరుతో వ్యభిచారమా

షార్ట్ ఫిలిమ్ లో ఛాన్స్ ఇస్తాము…హిట్ కొడితే డైరెక్ట్ గా హీరోయిన్ అయిపోతావంటూ నమ్మబలికి యువతుల్ని లోబరుచుకుని వ్యభిచారకుపంలోకి లాగే కేటుగాళ్లను నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉన్న యువతులను టార్గెట్‌గా చేసుకుని, వారికి మాయ మాటలు చెప్పి లోబర్చుకోవటం, రహస్యంగా సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలను చిత్రీకరించి బెదరిస్తూ… వ్యభిచారం చెయ్యాలని, లేదంటే ఈ వీడియోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని భయపెట్టి వ్యభిచార కూపంలోకి దించుతున్నారు.

నెల్లూరు జిల్లా జ్యోతి నగర్ కు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ అలియాస్ మహేష్ అనే వ్యక్తి షార్ట్ ఫిలిమ్స్ పేరుతో అనేక మంది అమ్మాయిలకు వల వేశాడు. షార్ట్ ఫిలిమ్స్ లో ప్రతిభ చూపితే సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానని అనేక మంది అమ్మాయిలకు మాయమాటలు చెప్పాడు. అమ్మాయిలు కూడా వెండి తెరపై వెలిగిపోవాలన్న ఆశతో అతని ఉచ్చులో పడిపోయారు. అలా సినిమా చాన్స్‌లు కావాలంటే తన కోరిక తీర్చాలంటూ బెదరిస్తూ… ఎంతో మంది జీవితాలను నాశనం చేసిన ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతని కోరికలకు బలైన వారిలో కొందరు మైనర్‌ బాలికలు కూడా ఉన్నారు. సెల్‌ఫోన్‌లో రహస్యంగా చిత్రీకరించిన వీడియోలు బయటపెట్టకుండ ఉండాలంటే వ్యభిచారం చేయాలని బెదరించేవాడు. అలా నగరంలో 6చోట్ల వ్యభిచార గృహలను నిర్వహిస్తున్నాడు. కోవూరుకు చెందిన ఓ మైనర్‌ బాలికను ఇలాగే బలవంతం పెట్టడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. వ్యభిచార గృహలపై ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దాడుల్లో ప్రధాన ముద్దాయి షేక్ జాకీర్ హుస్సేన్ తో పాటూ వ్యభిచార గృహాలు నడుపుతున్న బాధిత యువతులు, మహిళలను, విటులను అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్, విరాట్ నగర్ లో వ్యభిచార గృహం నడుపుతున్న షేక్ నూరి, కోటమిట్టలో వ్యభిచార గృహం నడుపుతున్న పలువురు యువతులను, పోస్టల్ కాలనీలో వ్యభిచారం గృహం నడుపుతున్న ఓ మహిళను, వేదాయపాళెంలో నిర్వహిస్తున్న మునగల శ్రీనివాసరావు, వనంతోపు సెంటర్ లో నిర్వహిస్తున్న మరో మహిళను, చిల్డ్రన్స్ పార్క్ వద్ద రాంజీనగర్ లో వ్యభిచారం గృహం నిర్వహిస్తున్న మహిళను అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో రెడ్ హ్యండెడ్‌గా దొరికన వారిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు.

యువత మాయమాటలు నమ్మవద్దని, ఏ మాత్రం అనుమానం వచ్చిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి సూచించారు. యువతులకు సూచించారు. ప్రధాన నిందితుడు జాకీర్ హుస్సేన్ కు చెందిన కారు, బైక్, కంప్యూటర్, హార్డ్ డిస్క్ తో పాటూ, ముద్దాయిలకు సంబందించిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp