సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సుశాంత్ మరణానికి కారణం అతని ప్రియురాలు రియా చక్రవర్తి అంటూ ఆరోపణలు మీద ఆరోపణలు వస్తున్నాయి. సుశాంత్ మరణానికి ఆరు రోజుల ముందు డబ్బుతో ప్లాట్ కాలి చేసిందని ఆమె సుశాంత్ తండ్రి ఫిర్యాదు చెయ్యగా తాజాగా సుశాంత్ సోదరి మితు సింగ్ సుశాంత్ ప్లాట్‌లో క్షుద్ర పూజలు జరిగాయని, ఒక తాంత్రికుడిని పిలిపించి రియా ఇదంతా చేసిందని ఆరోపించారు. ఇదే విషయంలో సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మితు సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే.