అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సుదీర్ సుడిగాడు.ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మోనల్ గజ్జర్.అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఒక్క తెలుగులోనే కాదు తమిళ, మరాఠీ గుజరాతీ భాషల్లో కూడా మోనల్ గజ్జర్ సినిమాలు చేసింది. కానీ అవి కూడా హిట్ ను సాదించలేకపోయాయి.
అయితే ఇటీవల బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో మోనాల్ పార్టిసిపెట్ చేసింది. ఈ షో ద్వారా మాత్రం మోనాల్ కు మంచి క్రేజ్ వచ్చింది. వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఇటీవల అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది. ఇక తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తుండగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను ప్రస్తుతం దుబాయ్ లో చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు.