బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాకిస్థాన్ కానీ వెళ్లాడా? అక్కడ అతను కరాచీలో వున్నట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మేటరేంటంటే.. అచ్చు గుద్దినట్టుగా అచ్చం సల్లూభాయ్‌ను పోలిన ఒకరి వీడియో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. కరాచీకి చెందిన ఈ వ్యక్తికి సల్మాన్ ఖాన్ పోలికలు ఉండడమే కాదు కండలు తిరిగిన శరీరం, ఒడ్డూ పొడుగు, క్రాఫింగ్ అంతా సల్మాన్ ఖాన్ మాదిరే ఉండడం విశేషం.
ఇలావుంటే.. బాలివుడ్ బ్యూటీ అనుష్కశర్మ, అమెరికన్ సింగర్ జూలియా మైకేల్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో బాగా సర్కులేట్ అవుతున్నాయి. ఫేస్‌బుక్‌లో వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి ‘అనుష్క శర్మా… నీకు కానీ చెల్లి ఉందా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మనిషిని పోలిన మనుషులు అప్పుడెప్పుడో రాముడు-భీముడు నాటి నుంచి ఇప్పటి జైలవకుశ వరకు చాలా సిన్మాల్లో చూశాం. ఇలాంటివారిని సింపుల్‌గా హలో బ్రదర్స్ అని పిలుచుకుంటాం. అలాంటి వారు కనిపిస్తే ఆశ్యర్యంగా చూడ్డంలో అదో తుత్తి. రియల్ లైఫులో మనిషిని పోలిన మనిషి తారస పడితే… వారి మధ్య ఎలాంటి రక్త సంబంధాలు లేవని తెలిస్తే ఆశ్చర్యమే కదా. నిజానికి ఈ భూమ్మీద మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఒకే రూపంలో ఏడుగుర్ని చూడ్డం అసాధ్యం. అది కేవలం కమల్‌హసన్ దశావతారం మూవీలోనే సాధ్యం. మనిషిని పోలిన మనిషి మన కళ్ల ముందు అప్పుడప్పుడు చూస్తుంటాం. ఆ మధ్య వర్మ ఎన్టీఆర్ సినిమా కోసం చంద్రబాబు పాత్రధారిని వెతికే క్రమంలో రోడ్డు పక్క హోటల్లో టీలు అందించే ఒక మనిషిని మనోళ్లు చంద్రబాబు డూపుగా గుర్తించి సోషల్ మీడియాలో పెట్టేశారు. డొనాల్డ్ ట్రంప్, పుతిన్, నరేంద్ర మోడీ, రాందేవ్ బాబా, జూనియర్ ఎన్టీఆర్, అనుష్క శర్మ, సల్మాన్ ఖాన్, షోయబ్ అక్తర్ వంటి ప్రముఖలందరికీ కూడా డూప్‌లు వున్నారు. సోషల్ మీడియాలో ఆ డూప్‌ల ఫోటోలు, వీడియోలు చూశాం కూడా.. అచ్చం మీలా వుండే మరో మనిషిని చూడాలని అనుకుంటున్నారా? ఐతే.. వెంటనే www.twinstrangers.net అనే లింకులో వెతకండి. ఆలస్యం ఎందుకు మరి..?