హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం, పల్లపాడు పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేయడంపై దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు ఎలా వేశారంటూ ప్రశ్నించింది. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భవాలన్నింటికి వైసీపీ పార్టీ రంగులను వేస్తున్నారు. బడి, గుడి, స్మారక స్థూపాలనే తేడా లేకుండా అన్నింటికి పార్టీ రంగులు అద్దుతున్నారు. దీనిపై సామాన్య ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి. చివరకు ఈ రంగుల రాజకీయంపై హైకోర్టు లో పిటిషన్ దాఖలు కావడంతో కోర్టు గుంటూరు జిల్లా కలెక్టర్ ను నివేదిక కోరింది.