ప్రతి నెల వచ్చే జీతం కంటే తక్కువ వస్తే ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే మీ జీతం నుండి కత్తిరించబడే పిఎఫ్ డబ్బు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఇవ్వబడుతుంది. అది కూడా వడ్డీతో సహా ఉద్యోగ విరమణ చేసిన సమయంలో తీసుకోవచ్చు. అంతే కాకుండా ఉద్యోగం నుండి విరమణ పొందిన తరవాత మీకు పెద్ద మొత్తంలో ఇవ్వబడుతుంది. చాలామంది పిఎఫ్ కత్తిరించబడుతుందని బాధపడుతుంటారు. కానీ నీ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన నాడు పెద్ద మొత్తంలో డబ్బులు అందుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఈపీఎఫ్ రూల్స్ ప్రకారం 2020 -21 సంవత్సరానికి 8.5% ఇంట్రెస్ట్ వస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ఇంట్రెస్ట్ శాతం ప్రస్తుతం బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ లపై ఇస్తున్న ఇంట్రెస్ట్ కంటే ఎంతో ఎక్కువ అనే చెప్పాలి. కాబట్టి సాధారణంగా నెలకి 25 వేలు జీతం తీసుకునే ఒక వ్యక్తి ఈపిఎఫ్ ద్వారా నెలకు 8.5% శాతం వడ్ఢీ వస్తే అది 35 సంవత్సరాల వరకు అంటే ఉద్యోగ విరమణ పొందే సమయానికి 1.25 కోట్లు అవుతుంది.
అంతేకాకుండా పిఎఫ్ ఖాతాల నుండి తీసుకునే డబ్బు పై ఎలాంటి టాక్స్ కూడా పడదు. కాబట్టి ఇది ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉద్యోగ విరమణ పొందిన తర్వాత ప్రశాంతమైన జీవనం గడపడానికి కూడా ఉపయోగపడుతుంది.