25 పైసలతో 1.5 లక్షలు మీ సొంతం… అవునండి మీరు చదువుతుంది నిజమే! అయితే పాత నాణేలను సేకరించే ఆసక్తి ఉన్నవారికి మాత్రం ఇది గుడ్ న్యూస్. దీనికి 25 పైసల నాణెం ఉంటే చాలు. 25 పైసల నాణెం ఫోటోను “ఇండియామార్ట్.కామ్”లో అప్‌లోడ్ చేయండి. అంతే దానిని గరిష్ట వేలం పాడిన వ్యక్తి సొంతం చేసుకుంటాడు. కొనుగోలుదారుతో మీరు మాట్లాడే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది.
అయితే ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ఆ 25 పైసల నాణెం వెండి రంగులో ఉండాలి. ఇక్కడ పాత 5 పైసలు, 10 పైసల నాణేలకు మంచి డిమాండ్ ఉంటుంది. పాత రూ.1 నోట్ లేదా రూ.2, రూ. 5 నోట్లకు కొన్ని షరతులతో లక్షలు పొందవచ్చు. అత్యంత ప్రజాదరణ పొందిన మరొక సిరీస్ ‘786’. ఈ సిరీస్‌కు ముస్లింలలో చాలా డిమాండ్ ఉంది. ‘786’ సిరీస్‌తో ఉన్న కరెన్సీ నోట్లు శుభప్రదమని భావిస్తారు.
ఇంకా వైష్ణో దేవి రూపంలో ఉన్న రూ. 5, రూ .10 నాణేల ద్వారా వేలంలో లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఈ నాణేలను ప్రభుత్వం 2002లో జారీ చేసింది. వాటికి చాలా డిమాండ్ ఉంది. హిందువులు మాతా వైష్ణో దేవిని బాగా గౌరవిస్తారు. కాబట్టి అలాంటి నాణేన్ని సొంతం చేసుకోవడానికి లక్షలు ఖర్చు చేసేవారు చాలా మంది ఉన్నారు. పాత ఒక రూపాయి నోటులో 1977-1979లో ప్రధాని మొరార్జీ దేశాయ్ హయాంలో పని చేసిన మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, హీరోభాయ్ ఎం పటేల్ సంతకం ఉంటే మీకు లక్కే లక్కు.