భూతల స్వర్గం జమ్మూకశ్మీర్‌కు పర్యాటకులు తాకిడి పెరిగింది. ఈ ఏడాది జమ్ములో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగినట్టు జమ్ము అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ము కశ్మీర్ ను సుమారు 1.62 కోట్ల మంది పర్యటకులు సందర్శించినట్టు అధికారులు వెల్లడించారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ వేగంగా అభివృద్ది చెందుతోందనడానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు. దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత మళ్లీ రికార్డు స్థాయిలో లక్షలాది మంది పర్యాటకులు జమ్ము కశ్మీర్ కు వచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు.
దీన్ని బట్టి చూస్తే కశ్మీర్ టూరిజంలో మరోసారి స్వర్ణయుగం మొదలైనట్లు కనిపిస్తోందని పలువురు అంటున్నారు. వాస్తవానికి జమ్మూకశ్మీర్‌లో పర్యాటక రంగమే అతిపెద్ద ఉపాధి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 1.62 కోట్ల మంది పర్యాటకులు కశ్మీర్‌ను విజిట్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
75 ఏండ్ల స్వాతంత్య్ర భారత్ చరిత్రలో ఈ స్థాయిలో పర్యాటకులు రావడం ఇదే తొలి సారి అని చెప్పాయి. ఈ ఏడాదిలో కేవలం మొదటి ఎనిమిది నెలల్లోనే రికార్డు స్థాయిలో 20.5 లక్షల మంది దేశీయ పర్యాటకులు వచ్చినట్టు తెలిపాయి. అందులో సుమారు 3.65 లక్షల మంది అమర్‌నాథ్ యాత్రికులు ఉన్నట్లు పేర్కొన్నాయి.
పహల్గామ్, గుల్మార్గ్, సోనామార్గ్ లాంటి పర్యాటక ప్రాంతాల్లో హోటల్స్, గెస్ట్‌హౌజ్‌లు వందకు వంద శాతం పూర్తిగా పర్యాటకులతో నిండిపోయినట్లు వెల్లడించాయి. టూరిజం వల్ల పూంచ్, రాజౌరి, జమ్మూ, కశ్మీర్ లోయలో ఉపాధి అవకాశాలు భారీగా పెరిగినట్టు చెబుతున్నారు. అక్కడ సినిమాల కోసం ఓ సమగ్రమైన పాలసీని కూడా రూపొందించారు. ఈ ఏడాది 140 వరకు షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.