ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలలో గుడ్డు ఒకటి అని చెప్పవచ్చు. మన రోజువారి ఆహారపదార్థాలలో గుడ్డు చేర్చుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రొటీన్లు లభిస్తాయని డాక్టర్లు సూచిస్తుంటారు. అయితే గుడ్డు తినని వారికి ప్రోటీన్లు కావాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే అనుమానం కలుగుతుంది.చాలామంది శాఖాహారులకు ఇటువంటి ప్రొటీన్లు లభించాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? అయితే గుడ్డు లో కాకుండా ప్రొటీన్లు అధికంగా లభించే ఇతర ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
1) చిక్ పా: ఎంతో చిన్నవిగా, గ్లోబు వంటి ఆకారంలో కనిపించే ఈ గింజలలో ప్రతి అర కప్పు చిక్ పా లో 8 గ్రాముల ప్రొటీన్లు లభ్యమవుతాయి. అంతేకాకుండా వీటిలో అధిక మొత్తం ఐరన్ ,క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి.
2) తృణధాన్యాలు: తృణధాన్యాలలో మొక్కల ఆధారిత పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అరకప్పు తృణధాన్యాలను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మన శరీరానికి 9 గ్రాముల ప్రొటీన్లు అందుతాయి.
3) కిడ్నీ బీన్స్: ఫైబర్ శాతం అధికంగా ఉండే వీటిని మన ఆహారంలో తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్లను అందించడమే కాకుండా మన శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఒక కప్పు ఈ బీన్స్ తీసుకోవడం వల్ల 12 గ్రాముల ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి.
4) సోయాబీన్స్: మొక్కల ఆధారితమైన ఈ సోయాబీన్స్ లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చెప్పవచ్చు. ఒక కప్పు సోయాబీన్స్ తీసుకోవడం ద్వారా 28 గ్రాముల ప్రోటీన్లు మన శరీరానికి అందుతాయి.
5) క్వినోవా: మొక్కల ఆధారితంగా లభించే ఈ క్వినోవాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒక కప్పు క్వినోవా నుంచి 8 గ్రాముల ప్రొటీన్లను పొందవచ్చు.అంతే కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
6) గుమ్మడికాయ గింజలు: సాధారణంగా గుమ్మడికాయ గింజలు తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఇందులో అనేక పోషకవిలువలు ఉన్నాయి. ఇందులో 1/4 వ కప్పు గింజలలో 10 గ్రాముల ప్రొటీన్లను అందిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
7) వేరుశెనగ పప్పు: కేవలం రెండు టేబుల్ టీస్పూన్ల వేరుశనగపప్పును తీసుకోవడం ద్వారా 7 గ్రాముల ప్రొటీన్లను పొందవచ్చు.
8) బాదం: 1/4 వ కప్పు బాదం నుంచి 7 గ్రాముల ప్రోటీన్ లను పొందవచ్చు. కేవలం ప్రోటీన్లు మాత్రమే కాకుండా అధిక మొత్తంలో విటమిన్లు, కాపర్, మెగ్నీషియం బాదం నుంచి పొందవచ్చు.
9) పెరుగు: రుచికరమైన ప్రో బయాటిక్ పెరుగు నుంచి 23 గ్రాముల ప్రోటీన్లను పొందవచ్చు.
10) చీజ్: మనం తయారుచేసుకున్న ఆహారపదార్థాలకు మరింత రుచి రావాలంటే అందులో చీజ్ వేసుకోవాలి. 100 గ్రాముల చీజ్ 23 గ్రాముల ప్రోటీన్ లను అందిస్తుంది.
శాకాహారులు గుడ్డు కాకుండా ఈ విధమైన ఆహార పదార్థాలను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో ప్రోటీన్లను పొందవచ్చు.