రాబోయే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగాలకు మిషన్ మోడ్‌లో రిక్రూట్‌మెంట్ చేపట్టాలని వివిధ ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.
అన్ని ప్రభుత్వ, మంత్రిత్వ శాఖలలో మానవ వనరుల స్థితిగతులపై ప్రధాని ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఈ మేరకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పీఎంవో పేర్కొంది.
దేశంలో నిరుద్యోగ సమస్యపై మోడీ సర్కార్ ను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఖాళీలు ఉన్నప్పటికీ వాటిని భర్తీ చేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో విమర్శలకు చెక్ పెట్టేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు 18 నెలల్లో 10 లక్షల ఉద్యోగాల భర్తిచేయాలని నిర్ణయించింది.