ఢిల్లీలో ఆదివారం అల్లర్లలో పాల్గొన్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అరెస్టయిన వారిలో ఎవరూ విద్యార్ధులు కారని పోలీసులు స్పష్టం చేశారు. అరెస్టయిన వారంతా జామియా యూనివర్సిటీ సమీపంలోని జామియా నగర్, షహీన్ బాగ్ ప్రాంతానికి చెందిన వారని.. వారందరు నేర చరిత్ర గల వారని పోలీసులు తెలిపారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల వీడియో పుటేజీలను ఆధారంగా జామియా నగర్, షహీన్ నగర్ ప్రాంతాల్లో రాత్రంతా దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. వాట్సాప్ గ్రూప్ లో అల్లరి మూకలను రెచ్చగొట్టిన వారిని కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.