అయోధ్య రామ మందిరానికి రూ. 100 కోట్ల విరాళంయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇప్పటిదాకా రూ. 100 కోట్ల విరాళాలు వచ్చినట్టుగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇందుకు సంబంధించిన సమాచారం మొత్తం తమకు చేరకపోయినా.. రూ.100 కోట్ల విరాళాలు వచ్చినట్లు తమ కార్యకర్తలు వెల్లడించినట్టు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ప్రకటించారు.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 15న శ్రీకారం చుట్టింది. ఫిబ్రవరి 27 వరకు కొనసాగనుంది. రామ మందిరం కోసం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా రూ.5 లక్షల ఒక వంద రూపాయలను విరాళంగా అందజేశారు. దేశవ్యాప్తంగా 5 లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించాలని రామ జన్మభూమి ట్రస్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. విరాళాల సేకరణలో విశ్వహిందూ పరిషత్ కూడా పాలుపంచుకుంటోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగా.. మొత్తం 39 నెలల్లో పూర్తి చేయనున్నారు.