అతడి అకౌంట్ లో 17 రూపాయలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంతలో సడెన్ గా ఖాతాలోకి 100 కోట్లు వచ్చి పడ్డాయి. బ్యాలెన్స్ చూసి… అందులో ఉన్న సున్నాలు చూసి కళ్లు గిరగిర తిరిగాయి. నోటి నుంచి మాట గాయబ్ అయింది. ఎవరికి చెప్పుకుందామనుకుంటే గుండె లో దడ మొదలైంది. అంతేగా.. మరి అతడికే కాదు ఎవరికైనా ఇలాగే ఉంటుంది.
ఇక ఇలాంటి స్విచ్ఛ్వేషన్లో ఉన్న అతడికి సైబర్ క్రైం పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. ఈ నెల 30 లోగా ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు తీసుకురావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మరో వైపు అన్ని డబ్బులు అతడి అకౌంట్ లో ఎలా వచ్చాయి.. ఎవరు అతనికి వేశారనే దానిపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దీంతో పాపం అతడు ఏం చేయాలో అర్థం కాక.. బ్యాంకుకు పరుగులు తీశాడు.
ఈ ఘటన బెంగాలో లోని దేగంగాలోని వాసుదేవ్ పుర్ లో చోటుచేసుకుంది. అతడే మహ్మద్ నసీరుల్లా, వ్యవసాయ కూలీ. తల్లిదండ్రులతో పాటు భార్యపిల్లలందరూ అతని సంపాదనపైనే ఆధారపడ్డారు. దినసరి కూలీతోనే నెట్టుకొస్తున్న క్రమంలో ఈ ఘటన అతడిని మరింత టెన్షన్ కు గురిచేసింది. అయితే అతడి ఎస్బీఐ అకౌంట్ లో అనుకోకుండా బ్యాంక్ లావాదేవీల్లో జరిగిన టెక్నికల్ ప్రాబ్లమ్ తో ఇలా వంద కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యి ఉంటాయన్నది అనుమానం.
అయితే నసీరుల్లా అకౌంట్ కు ఎలా డబ్బులు వెళ్లాయనేది బ్యాంక్ సిబ్బంది చెక్ చేస్తున్నారు.ఇక ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదు. లాస్ట్ ఇయర్ తమిళనాడు చెన్నైలోని టీ నగర్ హెచ్డీఎఫ్ సీ బ్యాంకుకు చెందిన 100 మంది ఖాతాదారుల ఖాతాల్లో 13 కోట్లు జమ కావడంతో అందరూ ఒక్కసారే కోటీశ్వరులయ్యారు.