బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో డివివి దానయ్య డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించగా అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం స్వతంత్రం రాక ముందు బ్రిటిష్, నిజాంలకు వ్యతిరేకంగా పోరాడిన ఇద్దరు భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు (రామ్ చరణ్) కొమరం భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) యొక్క కల్పిత కథ గా తెరకెక్కుతుంది.
400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ డిసెంబర్ 9న ఐదు భాషల్లో విడుదల అయింది. కాగా తాజాగా ఇప్పుడు యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ ను సాధించింది.
హిందీలో – 52M మిలియన్ వ్యూస్
తెలుగులో – 36M మిలియన్ వ్యూస్
కన్నడలో – 7.2 మిలియన్ వ్యూస్
తమిళంలో – 7 మిలియన్ వ్యూస్
మలయాళంలో – 3.5 మిలియన్ వ్యూస్