మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ల తో పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరి కోరిక నెరవేరింది. ఏపీ సర్కార్ సినిమా టికెట్ల ధరల వివాదంపై కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఏపీలోని అన్ని థియేటర్ల లో శుక్రవారం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీ అందుబాటులోకి రానుందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
అయితే మాస్కు తప్పని సరి అని కూడా పేర్కొన్నారు. టిక్కెట్ల రేట్లపై అన్నివిధాలా చర్చించామని టిక్కెట్ల రేట్లు విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ అడిగిన 99 శాతం వాటికి ప్రభుత్వం అనుకూలంగా ఉందని స్టీరింగ్ కమిటీ సభ్యులు తెలిపారు.
మొత్తం మూడు స్లాబ్ లలో టికెట్ల ధరలు ఉండనున్నట్లు చెప్పారు. కాగా గురువారం సినిమా టికెట్ల ధరల సమస్యలపై సచివాలయంలో స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ విశ్వజిత్ ఇతర సభ్యులు హాజరయ్యారు.