నేడు చాలా మంది ఉద్యోగులు ఏడాదిలోనే మూడు నుంచి నాలుగు కంపెనీలు మారుతున్నారు. ఏ కంపెనీలో చేరినా ఏడాది పాటు కుదురుగా ఉండలేకపోతున్నారు. ఇప్పుడు రెండు మూడేండ్లు ఒకే కంపెనీలో చేయడమంటే అది పెద్ద విషయంగా కనిపిస్తోంది.
అలాంటిది రెండో, మూడో కాదు ఏకంగా 84 ఏండ్లుగా ఓ వ్యక్తి ఒకే కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో చేరినప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఇప్పుడు కూడా ఉంటున్నాడు. ఆయనను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నాడు. అత్యధిక కాలం ఒకే కంపెనీలో పనిచేసిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ రికార్డును ఆయన సృష్టించారు.
బ్రెజిల్ కు చెందిన వాల్టర్ ఆర్తమాన్ గతంలో ఓ దుస్తుల కంపెనీలో జాయిన్ అయ్యాడు. అప్పటి నుంచి తనకు అప్పగించిన పనులను చక్కగా, వేగంగా చేసేవాడు. దీంతో ఆయనపై కంపెనీకి నమ్మకం కుదిరింది. దీంతో త్వరలోనే సేల్స్ మేనేజర్ స్థాయికి చేరుకున్నాడు.
ప్రస్తుతం ఆయన వయస్సు 100 సంవత్సరాలు. ఇప్పటికీ ఇంకా అదే కంపెనీలో అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అంత సీనియర్ అయినప్పటికీ తన జూనియర్లకు గౌరవం ఇచ్చి మాట్లాడుతారు. అందుకే ఆ కంపెనీ ఉద్యోగులకు ఆయనంటే ఓ ప్రత్యేక గౌరవం.