ఇదే నా మొదటి ప్రేమ లేఖ, రాసాను నీకు చెప్పలేక, ఎదుటపడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతకాక,అంటూ సినీకవి రాసిన పల్లవి. నిజమే…!ప్రతీ మనిషి జీవితం ప్రేమకోసం తపించే ఉంటుంది.తన ప్రియుడికో, ప్రియురాలికో తనమనసులో ఉన్న భావాన్నీ, బాధనీ చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరే ఉంటుంది.
అయితే తాను ప్రేమించిన వ్యక్తిముందు అనుకున్నది అనుకున్నట్టు చెప్పలేక, చెప్పడం చేతకాక తడబడినప్పుడు, తన ప్రేమని పదిలంగా పేపర్ మీద పెట్టి..ప్రేమించిన మనసుకి చేరవేస్తుంది. దానిపేరే ప్రేమలేఖ. ప్రేమించే వయసు దాటిపోయినా అప్పుడప్పుడూ ప్రేమలేఖల్లో నిక్షిప్తమై ఉన్న ప్రేమికుణ్ణి లేదా ప్రేమికురాల్ని చూసుకుని మురిసిపోయేవాళ్ళు ఎంత మంది లేరు.!?
ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్ లు వచ్చాకా తమ మనసులో ఉన్న మాట చెప్పడానికి సులువు అవుతోంది కానీ..ఒకప్పుడంతా ప్రేమలేఖల మయమే. అలాంటి ఓ వందేళ్ళ ప్రేమ లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది.
100 సంవత్సరాల క్రితం ప్రేమలేఖా..!? వినడానికే చాలా ఆశ్యర్యంగా ఉందికదా..!?ఆ ప్రేమలేఖ ఎవరిది? ఇప్పుడు ఆ ప్రేమికురాలు లేదా ప్రేమికుడు ఎక్కడున్నారు?! అనే విషయాలు తెలుసుకుందాం. బ్రిటన్ కి చెందిన ఒక మహిళ కొడుకు కి ఈ లేఖ దొరికింది. ఒక విరిగిపోయిన టైల్ మధ్యలో ఆ లేఖ కనబడింది.
ఇక మరి వందేళ్ళ క్రితం ప్రేమలేఖలో ఏం రాసారు అనేది చూద్దాం. నా ప్రియాతి ప్రియతమా అంటూ స్టార్ట్ చేసారు. ఈ ప్రేమ మనిద్దరి మధ్యనే ఉండాలని..నాకు పెళ్లయింది కనుక నన్ను రోజు కలువు అని అడగొద్దు అని రాసి వుంది. అలానే రోజు కలిస్తే కొత్త సమస్యలు వస్తాయి.
ఇట్లు నీ ముద్దుల ప్రియుడు రోనాల్డ్ అని ఈ లేఖ లో వుంది. కలుసుకోవాలంటే ట్రామ్ కార్నర్ వద్ద అర్థరాత్రి కలుద్దాం.అని ఆ లేఖ లో రాసారు. 1920 కంటే ముందుదే అని తెలుస్తోంది.