తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో మత్స్యకారుల వలకు భారీ చేప చిక్కింది. అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుండి సముద్ర వేటకు వెళ్లిన కాకినాడ మత్స్యకారుల వలలో సుమారు టన్నుకు పైగా ఉండే భారీ చేప వచ్చి పడింది. అయితే, అంత పెద్దగా ఉండటంతో మత్స్యకారులు దాన్ని ఎత్తలేకపోయారు. దీంతో, క్రేన్ సహకారంతో బోటు నుండి మినీ వాన్ పైకి ఎక్కించి కాకినాడ మార్కెట్టుకు తరలించారు.
ఈ చేపను చూసేందుకు చుట్టు పక్కల ప్రజలు తరలి వచ్చారు. ఇంత పెద్ద చేపను చూసి ఒకింత ఆశ్చర్యానికి గురైయ్యారు. అసలు ఇంత పెద్ద చేపలు ఉంటాయా అని అనుమానం కూడా పలువురు వ్యక్తం చేస్తున్నారు.