దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకి మరింత తగ్గుముఖం పడుతోంది. గత రెండు వారాల నుంచి కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. ఈ క్రమంలో ఇవాళ భారీ స్థాయిలో కేసులు దిగొచ్చాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 10 వేల 64 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం జూన్ 12 తర్వాత మళ్లీ ఇదే తొలిసారి. అటు కరోనా కారణంగా నిన్న 137 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 17,411మంది నిన్న కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
మొత్తం కేసులుః 1,05,81,837
యాక్టివ్ కేసులుః 2,00,528
కోలుకున్నవారుః 1,02,28,753
మరణాలుః 1,52,556
దేశవ్యాప్తంగా నిన్న 7.09 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు 18.78 కోట్ల పరీక్షలు చేసినట్టు వివరించింది.